ప్రతి కార్పొరేట్ ఉద్యోగికి ఇది అంకితం
తల్లిదండ్రులను వదిలిపెట్టి
సొంత ఊరిని విడిచిపెట్టి
కొత్త చోటికి దిక్కు పట్టి
పోతున్నావా నా మిత్రమా!
కాలుష్యంతో సహవాసం
లక్షల మందితో పోరాటం
వెనుదిరిగితే దిక్కు లేదు
సిగ్గు విడిచి బ్రతకలేము.
ఇరుకు గదిలో మగ్గే వేళ
సూర్య దర్శనం జరిగేదెలా?
ప్రశాంతతకు ఏదీ సమయం,
నీ సమయమే నీది కాదు.
కష్టపడితే అవమానం
కాకా పడితే రాజయోగం
ముసుగు మనుషుల సమూహం లో
కల్తీ బ్రతుకే శాశ్వతం.