ఓ బాపు నూ మళ్ళీ రావాలి(An ode to KCR)
బాపు నూ మళ్ళీ రావాలి,
కానీ మాలో ఒకనిగ
ఈసారి పాలన చేయాలి,
ఓ బాపు నూ మళ్ళీ రావాలి
-
జోరుగ సభలే జరపాలి
హోరుగ మాటలు విసరాలి
పోరున మళ్లీ గెలవాలి
ఓ బాపు నూ మళ్ళీ రావాలి
-
బాపు నూ మళ్లీ రావాలి,
కానీ మాతో నేరుగ
ఈసారి ముచ్చటలాడాలి,
ఓ బాపు నూ మళ్ళీ రావాలి
-
ఓటుకి నోటు మానాలి
విద్యా వైద్యం ప్రధమం కావాలి
మనమంతా అక్రమ మార్గం వీడాలి
ఓ బాపు నూ మళ్ళీ రావాలి
-
బాపు నూ మళ్ళీ రావాలి
కానీ హస్తినకి గులాం
అవ్వడం మానాలి,
ఓ బాపు నూ మళ్ళీ రావాలి
-
పారదర్శక పాలన చేయాలి
స్వేచ్ఛ వాయువులను స్వేచ్ఛగ తిరగనివ్వాలి
కర్షక కార్మిక వ్యాపారస్థులని ఒకటిగ చూడాలి
మాగాణాల తెలంగాణము సస్యశ్యామలమవ్వాలి
ఓ బాపు నూ మళ్ళీ రావాలి
---
...పాఠకులకి టెంకాయలే కనిపిస్తున్నాయి మొట్టికాయలు కనిపిస్తలేవు. ఇది గమనార్హమే..