మనము - నేను
మనము మేమవ్వును
మేము నేనవ్వును
నేను ఏమవ్వును ?
-
నాడు నేడవ్వును
నేడు రేపవ్వును
రేపు ఏమవ్వును ?
-
వీరు వారవ్వును
వారు వాడవ్వును
వాడు ఏమవ్వును
-
మనము మేమవ్వును
మేము నేనవ్వును
నేను ఏమవ్వును ?
-
నాడు నేడవ్వును
నేడు రేపవ్వును
రేపు ఏమవ్వును ?
-
వీరు వారవ్వును
వారు వాడవ్వును
వాడు ఏమవ్వును
-
అమ్మ బొడ్డు కోసింది మొదలు
భూతల్లి ఒడిన బూడిదై కాలే వరకూ
అవినీతి రీతియే నా వేద భారతావని ధర్మ నీతి
-
పదవుల్లో ఉండే దొరలు మొదలు
కొలువుల్లో ఉండే ప్రజలు వరకు
ఆఖరికి ఆ ఏడుకొండల సామి ముడుపు కొరకు
ఇచ్చి పుచ్చుకోవడమే
ఈ వికర్మ-భూమి నేటి అలనాటి ఆనవాయితీ
-
పన్నుల భారం ముళ్ళ శిరోధార్యం
కాని విద్య-వైద్యం చిల్లర బేరం
అయినా ఓటే వెయ్యని గాడిదలకు
కలుషిత సామ్రాజ్యమే సరైన రాజ్యం
ఉచితాలకు రుచి మరిగిన జనం
పురోగతి అధోగతిపాలయితే వారికేం
అయినా ఓటు అమ్మిన కుక్కలకు
నక్కల సామ్రాజ్యమే సరైన రాజ్యం
-
ముష్కర మూకలు కక్కేరు విష విద్వేషములు
కాని జనుల భవితకై కదం తొక్కరే! నోరు మెదపరే!
ఓటుని అమ్ముకోవద్దని హితోపదేశం చేయరే
లంజ్చం హీనమని గొంతేత్తి గీతోపదేశం చేయరే
అయినా అధర్మార్జన చేసే పందులకు
విషపూరిత సామ్రాజ్యమే సరైన రాజ్యం
-
అనాటి కవుల నుంచి ఈనాటి నా బోటి వారి వరకు
ఎవరెన్ని రాసినా ఎవరెన్ని కూసినా ఏమి లాభం
అధర్మ పథమే పరమ పథముగా పరుగిడు జనం
కాల-ధర్మమే ఇక నిర్ణయించును భారతపు పథగమనం
In the post (stages of flower in tamil) https://www.reddit.com/r/Dravidiology/s/zMSiR005W2
Can some one help me with the split of words for pommal and chemmal (if possible split + meaning). I think the split of "Pothumpar" is po + thumpar(group).. I guessed it based on telugu word తంపర(tampara) meaning group. Please correct me if I am wrong
For chemmal I am assuming it's chen + mal = red + flower. Please correct me if I am wrong.
పుడింగి అమ్మకి పిడింగు కోపం,
బుడ బుడ అడుగులు వేస్తూ,
గడ గడ టీ నే పెడుతుంది
లొడ లొడ ఫోన్లో ముచ్చట పెడుతుంది
టక టక అడగక ముందే ఉపదేశం చెప్తుంది
బడ బడ చాటుగా నేరుగా నన్నె తిడుతుంది
పొగ పొగ కక్కే చిక్కటి కాఫీ
మెత్తటి ఇడ్లి ఫట్టునా లాగిస్తుంది
డిగి డిగి కమ్మని వంటలు చేస్తుంది
దడ దడ నాన్నకు భయపడుతుంది
చిడ చిడ తన విధినే తను తిడుతుంది
తెగ తెగ దిగులే నా గురించి పడుతుంది
బిగ బిగ పెద్దది అమ్మ అవుతుంది
బగ బగ బీపీ, తియ్యని చెక్కర అమ్మకు వచ్చింది
చక చక కాలం, కళ్లెం లేక, భయమే లేక పరిగెడుతుంది
తడి తడి కన్నులు,
పొడి పొడి గొంతుని,
పగిలిన గుండెను నాకిస్తుందేమోనని భయమేస్తుంది
ఈ గాడిద కొడుకు పెట్టిన బాధకు
చెప్పు తో కొట్టి
కాలు తో తన్ని
ప్రేమ తో ముద్దె పెట్టి,
క్షమింపవమ్మా మాయమ్మ ఓయమ్మ దుర్గమ్మ
పుడింగి అమ్మకి పిడింగు కోపం,
బుడ బుడ అడుగులు వేస్తూ,
గడ గడ టీ నే పెడుతుంది
-
లొడ లొడ ఫోన్లో ముచ్చట పెడుతుంది
టక టక అడగక ముందే ఉపదేశం చెప్తుంది
బడ బడ చాటుగా నేరుగా నన్నె తిడుతుంది
-
పొగ పొగ కక్కే చిక్కటి కాఫీ
మెత్తటి ఇడ్లి ఫట్టునా లాగిస్తుంది
డిగి డిగి కమ్మని వంటలు చేస్తుంది
-
దడ దడ నాన్నకు భయపడుతుంది
చిడ చిడ తన విధినే తను తిడుతుంది
తెగ తెగ దిగులే నా గురించి పడుతుంది
-
బిగ బిగ పెద్దది అమ్మ అవుతుంది
బగ బగ బీపీ, తియ్యని చెక్కర అమ్మకు వచ్చింది
చక చక కాలం, కళ్లెం లేక, భయమే లేక పరిగెడుతుంది
-
తడి తడి కన్నులు,
పొడి పొడి గొంతుని,
పగిలిన గుండెను నాకిస్తుందేమోనని భయమేస్తుంది
-
ఈ గాడిద కొడుకు పెట్టిన బాధకు
చెప్పు తో కొట్టి
కాలు తో తన్ని
ప్రేమ తో ముద్దె పెట్టి,
క్షమింపవమ్మా మాయమ్మ ఓయమ్మ దుర్గమ్మ
***